Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
అధికార పార్టీ పేరు చెప్పుకొని గీత కార్మికులపై వేధింపులకు భౌతిక దాడులకు పాల్పడుతున్న సొసైటీ అధ్యక్షుడు శంకర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గీత కార్మికులు మండలకేంద్రంలో శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో జరుగుతున్న ప్రజాదర్బార్ వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్,బీఎస్పీ నాయకులు మోడీగారి శ్రీశైలం,జనగాం శంకరయ్య డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి బోనగిరి గణేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు కాసుల నరేష్, మాదాని నవీన్, లక్కాకుల ప్రభాకర్, గీత కార్మికులు సొసైటీ డైరెక్టర్ జనగాం మహేష్,మోరిగాడి రాజు, మొరిగాడి బాలరాజు, అంబాల లక్ష్మీనరసయ్య,మొరిగాడి రాములు ,పి.శ్రీనివాస్, పల్లె శివ, దూసరి భిక్షపతి, పల్లె భరత్, కృష్ణ, యాదగిరి, గడ్డాల రాజయ్య, జనగాం రమేష్ తదితరులు ఉన్నారు.