Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు ఉపఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్‌చేస్తూ చౌటుప్పల్ నుండి హైద్రాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వరకు చేపడుతున్న మౌన ప్రదర్శనతో పాదయాత్రను శనివారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని వలిగొండ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఏఐటీయుసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌డి.యూసుఫ్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా యూసుఫ్, ఆర్టీసీ జెఏసీ చైర్మెన్ రాజిరెడ్డి మాట్లాడారు. ఈ నెల 7 నుండి 9 వరకు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఏప్రిల్ 1, 2017, ఏప్రిల్ 1, 2021 నుండి రావాల్సిన రెండు వేతన సవరణలు అమలుచేయాలన్నారు. జనవరి 1,2022 నుండి జులై 1, 2022 రావాల్సిన రెండు డీఏలు ఇచ్చి, ఏరియర్స్ తోపాటు చెల్లించాలన్నారు. సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలని, వేదింపులు ఆపాలని, పనిభారం తగ్గించాలని, 2013 వేతన సవరణ బాండ్స్ డబ్బులు చెల్లించాలన్నారు. వెల్ఫేర్ కమిటీని రద్దుచేసి యూనియన్లకు అనుమతించాలని డిమాండ్‌చేశారు. ఈ పాదయాత్రలో 30 మంది కార్మికులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. పాదయాత్రకు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మద్ధతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐఆర్టీడబ్ల్యుఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎమ్‌డి.పాషా, ఎఐటీయుసీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎమ్‌డి.ఇమ్రాన్, నాయకులు బచ్చనగోని గాలయ్య, ఆదిమూలం నందీశ్వర్, పల్లె శేఖర్‌రెడ్డి, పిల్లి శంకర్, కొంతం శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, కార్మికులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.