Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని గ్రీన్క్లబ్ ట్రస్ట్ ఈసీ సభ్యులు, సుధాకర్ పీవీసీ మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్ అన్నారు.గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2023 ఇకో క్యాలెండర్ను శనివారం స్థానిక ట్రస్ట్ ఆఫీస్లో ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడారు.గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఆరేండ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం సెలవు దినాలతో పాటు పర్యావరణ దినోత్సవాలు ప్రాముఖ్యతను కూడా క్యాలెండర్ ద్వారా ప్రజలకు తెలియపరచడం చాలా గొప్ప విషయమని వివరించారు.ఈ కార్యక్రమంలో సలహాదారు జె.శశిధర్,అధ్యక్షుడు ముప్పారపు నరేందర్కుమార్, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ తోటకిరణ్, కోశాధికారి ఉప్పలశ్రవణ్, ఉపాధ్యక్షులు బహురోజు ఉపేంద్రాచారి, గండూరి కృపాకర్, బంధు శ్రీధర్, ఈసీ సభ్యులు వనమా వెంకటేశ్వర్లు, ముప్పారపు నాగేశ్వరరావు, గుండా కిరణ్, పాలవెల్లి రమేష్, అనంతుల సువర్ణ లక్ష్మి, సోమ హేమమాలిని, డా. శిరీష, నల్లపాటి మమత, యామరజిని, గెల్లి అంజన్ ప్రసాద్, దారం శ్రీనివాస్,నల్లపాటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.