Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలో చేసిన అభివృద్ధి పనులపై నూతన సంవత్సర క్యాలెండర్‌ను తీయడం హర్షణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కళ్ళెపెల్లి మహేశ్వరి దశరథ ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.తన హయాంలో జరిగిన వివిధ రకాల అభివృద్ధి పనులపై చిత్రాలతో క్యాలెండర్ రూపొందించిన తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు.క్యాలెండర్ రూపంలో అభివృద్ధి పనులు మరింతగా ప్రజల దగ్గరకు చేరవవుతాయన్నారు.ఈ సందర్భంగా మల్లీశ్వరిని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ,నాయకులు రేణుబాబు,జానీ,సయ్యద్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.