Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
హుజూర్నగర్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశం అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ వల్లనే సాధ్యమన్నారు. ఇతర రాష్ట్రాలలో అని ప్రజాప్రతినిధులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణకు వచ్చి తెలుసుకొని పోతున్నారన్నారని తెలిపారు. బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలలో కూడా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు జరగటం లేదన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, తెలంగాణకు వచ్చి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి పోతున్నారని తెలిపారు. నిన్న జరిగిన సభ సందర్భంగా 125 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగాయి. హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి మరో వంద కోట్లు రానున్నాయన్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డిని సొంత పార్టీ కార్యకర్తలే నమ్మడం లేదని, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మెన్, గరిడేపల్లి మాజీ జెడ్పీటీసీ పెండెం శ్రీనివాస్, షంబిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.