Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-తిరుమలగిరి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేకవిధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లునాగార్జునరెడ్డి అన్నారు.మండలంలోని జలాలపురం గ్రామంలో శనివారం ఆ పార్టీ గ్రామ శాఖ సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను, ఇండ్లస్థలాలు, పార్టీ కార్యాలయం స్థలాన్ని పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రశ్రీను, మండల కన్వీనర్ గుమ్మడవెల్లి ఉప్పలయ్య, పల్లా సుదర్శన్, మిట్టపల్లి లక్ష్మీ, సోమయ్య, గ్రామ శాఖ కార్యదర్శి ఆవుల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.