Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లావ్యాప్తంగా అన్ని రైస్‌మిల్లులలో మొక్కలు నాటాలి
- అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేట
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా అన్ని రైస్‌మిల్లులలో మొక్కలు నాటనున్నట్టు అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు తెలిపారు. శనివారం బీబీగూడెంలోని మణికంఠ రైస్‌మిల్లులో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలన్నారు.విరివిగా మొక్కలు నాటడం ద్వారా వాయుకాలుష్యం తగ్గి మానవ మనుగడకు ఉపయోగపడతాయన్నారు.రానున్న తరానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించాలంటే విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డీఎం రాంపతినాయక్, డీఎస్ఓ ఇన్చార్జి పుల్లయ్య,డీటీసీఎస్ నాగలక్ష్మి, ఆర్ఐ హసన్ మహమ్మద్, రైస్‌మిల్ నిర్వాహకులు చల్ల అశ్విన్‌కుమార్, మేకపోతుల సతీష్, లక్ష్మీ, మధు, సిబ్బంది పాల్గొన్నారు.