Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కంచి రవికుమార్ ప్రభుత్వాన్ని కోరారు.శనివారం స్థానిక మండల రిసోర్స్ కేంద్రంలో మండలంలోని మునిపంపుల కాంప్లెక్స్ పరిధి స్కూల్లో టీఎస్‌యూటీఎఫ్ 5వ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 13, 14 లలో రంగారెడ్డి జిల్లా మన్నెగూడ లో జరగనున్న రాష్ట్ర మహాసభలకు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిలివేరు అనిల్‌కుమార్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు కె సోని, కట్ట కృష్ణ, ఆనంద్,కృష్ణవేణి, క్రిష్ణయ్య, మునిపంపుల ఉపాధ్యాయులు తిరుమల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్,విజరు రెడ్డి, పీఈటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.