Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 18న కేసిఆర్‌తో ప్రారంభం
- కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి
- కంటి వెలుగు అవగాహనాసదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్రంలో కంటి సమస్యలతో అంధత్వంతో బాధపడుతున్న ప్రజలకు కంటి వెలుగు ద్వారా ఈ నెల 18 నుండి ప్రతి గ్రామం, వార్డ్‌లో క్యాంప్‌లు నిర్వహించి పరీక్షలు చేసి కళ్లద్దాలు అందించడం ముఖ్య ఉద్దేశంగా కంటి వెలుగు కార్యక్రమమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రూపకల్పన చేశారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా అధికారులతో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. మొదటి విడత నిర్వహించిన కంటి వెలుగు ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ నెల 18 న సీఎం కేసీఆర్ హైద్రాబాద్ నుండి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభిస్తారని తెలిపారు. 18 నుండి ప్రారంభించి ప్రజల దగ్గరకే వెళ్లి పరీక్షలు చేసి 100 రోజుల్లో కార్యక్రమం పూర్తి అవుతుందన్నారు. అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరూ ఈ నెల 18 నుండి ప్రారంభం అయ్యే కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. కంటి వెలుగు ఏ రోజు ఏ గ్రామంలో నిర్వహిస్తారు, ఆ షెడ్యూలను ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులకు అధికారులు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, రాష్ట్ర అగ్రొస్ చైర్మెన్ విజయ సింహరెడ్డి, ట్రైకార్ చైర్మెన్ రాంచంద్ర నాయక్, జెడ్పీ చైర్మెన్లు బండ నరేందర్‌రెడ్డి, దీపికా యుగంధర్, సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిషోర్, రవీంద్రకుమార్, భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, జిల్లా కలెక్టర్లు టీి.వినరు కృష్ణారెడ్డి, హేమంత్ కేశవ్ పాటిల్, పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ఖుష్భు గుప్తా, దీపక్ తివారీ, ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు.