Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామస్తులు బస్వాపురం రిజర్వాయర్లో కోల్పోతున్న భూములకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 41వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆ గ్రామ ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు యాదవ్, సర్పంచ్ పిన్నం లతా రాజు మాట్లాడుతూ గ్రామస్తులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎడ్ల దర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ రావుల అనురాధ నందు, భూనిర్వాసితులు నకిరే కంటి నరసింహ, నకిరేకంటి హరిబాబు, నకిరేకంటి బాలయ్య, ఆర్టీసీ డ్రైవర్, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.