Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
క్రీడలతో క్రీడాకారులకు మానసికోల్లాసం కలుగుతుందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీర్ల ఐలయ్య అన్నారు.ఆదివారం మండల కేంద్రంలో ఇండోర్ స్టేడియంలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.టోర్నమెంట్లో గెలిచిన మొదటి, ద్వితీయ టీములకు బహుమతి ప్రదానం చేయనున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం ఏ ఎజాస్, మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు, సింగిల్ విండో డైరెక్టర్ కట్టగుముల సాగర్ రెడ్డి, ఎక్స్ ఎంపిటిసి ఎండి జయినుద్దీన్, జిల్లా కార్యదర్శి వల్లేపు ఉప్పలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగిరి సాగర్, బహదూర్ పేట మాజీ సర్పంచ్ కూల నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.