Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య
నవతెలంగాణ- రామన్నపేట
డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి త్రిబుల్ ఇంజన్ అయిన కార్మికులు, కూలీలు, రైతులు తగిన బుద్ది చెబుతారని వ్యకాస జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య అన్నారు. కేంద్ర బీజేపీి ప్రభుత్వం అవలంబించే రైతు, కార్మిక, కూలీ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సీఐటీయూ, వ్యకాస, రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సుకు రామన్నపేట ప్రజాసంఘాల నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జల్లెల పెంటయ్య జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చాక కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ఆదాని, అంబానీ వంటి బడా కార్పోరెట్లకు కొమ్ముకాస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ రాష్ట్ర స్థాయిలో సదస్సు నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయకార్యదర్శి బోయిని ఆనంద్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల అధ్యక్షుడు గన్నెబోయిన విజయభాస్కర్, వ్యకాస మండల అధ్యక్షుడు మెడబోయిన శ్రీనివాస్, వైస్ యంపిపి నాగటి ఉపేందర్ నాయకులు ఆవనగంటి నగేష్,పిట్టల శ్రీనివాస్, గుండాల భిక్షం, కొమ్ము అంజయ్య, మేడి ముకుందం, శానగొండ వెంకటేశ్వర్రు తదితరులు పాల్గొన్నారు.