Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవ తెలంగాణ క్యాలెండర్ను ఆవిష్కరించిన డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ- రాజాపేట
ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎనలేనిదని డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలోని తను నివాసంలో నవతెలంగాణ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల పాత్ర ఎన లేనిదని తెలియజేశారు. అనంతరం రాజపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి ప్రవీణ్, కమిటీ జానకి రాములు, దామోదర్ రెడ్డి నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి యాకయ్య, నవ తెలంగాణ రిపోర్టర్ చీర మహిపాల్, నరుండ్ల కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.