Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నవతెలంగాణ -చివ్వేంల
యాదవులు అన్ని రంగాల్లోనూ రాణించాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం దురాజ్ పల్లిలోని శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానంలో అఖిల భారత యాదవ మహాసభ , యాదవ ఉద్యోగుల సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్లను కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలన్నారు. యాదవ కులస్తుల సంక్షేమానికి తన వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు. ఐక్యంగా ఉండి యాదవ కులస్తులు తమ హక్కులను సాధించుకోవాలన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలన్నారు. అన్ని రంగాల్లోనూ యాదవుల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మెన్ వట్టే జానయ్య యాదవ్, శ్రీకృష్ణ యాదవ్ ట్రస్ట్ చైర్మెన్ డాక్టర్ రామ్మూర్తి, కాంగ్రెస్ నాయకులు తండు శ్రీనివాస్ యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మర్యాద ఉపేందర్ యాదవ్, యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మట్టపల్లి రాము యాదవ్, గౌరవ అధ్యక్షుడు మర్యాద సైదులు యాదవ్, రాష్ట్ర కన్వీనర్ బొబ్బలగోపాలకృష్ణయాదవ్, ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ యాదవ్, కోశాధికారి వీరబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, బయ్య మల్లికార్జున్, లింగమంతుల దేవస్థానం చైర్మెన్ కోడి సైదులు, ధర్మకర్తలు జటంగి వెంకటేశ్వర్లు యాదవ్, జానయ్య యాదవ్, బొల్లం మల్లేష్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘము అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య యాదవ్, బీసీ విద్యార్థి సంఘం చివ్వెంల మండలాధ్యక్షుడు పరాల సాయి కుమార్ యాదవ్ పాల్గొన్నారు.