Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-కట్టంగూర్
జాతీయ రహదారి 65 పామనగండ్ల నుండి నల్లగొండ అద్దంకి బైపాస్రోడ్ వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈ నెల 9న పిట్టంపల్లి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని ఇస్మాయిల్ పళ్లి గ్రామంలో పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేస,ి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కట్టంగూర్, నార్కట్పల్లి, శాలిగౌరారం మండలాల పరిధిలోని సుమారు 20 గ్రామాల ప్రజలు ఈ రహదారి గుండా జిల్లా కేంద్రానికి వెళుతుంటారని, రహదారి పూర్తిగా అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రహదారిని డబల్ రోడ్డుగా నిర్మాణం చేసి ప్రజలకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, చిలుకూరు నర్సింహ్మ, పెంజర్ల కృష్ణ, ఉపసర్పంచ్ జాల ఆంజనేయులు, దేవేందర్, ప్రవీణ్, నర్సింహ్మ పాల్గొన్నారు.