Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని వీరబ్రహ్మం దేవాలయం వద్ద విశ్వబ్రాహ్మణ సేవ దళ్, కొత్తోజు నరేంద్రచారి ఆధ్వరంలో 80 మంది చిరుమర్తి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పధకాలు అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. నకిరేకల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. రూ. 10 లక్షలతో స్వర్ణ కార సంఘం నూతన బిల్డింగ్ శంకుస్థాపన చేశామన్నారు. రూ. 10 లక్షలతో వీరబ్రహ్మం దేవాలయం స్లాబ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘంలో నిరుపేద కుటుంబానికి చెందిన వారికి భూమి కేటాయిస్తామన్నారు. పార్టీలో చేరిన వారిలో సంకోజు నర్సయ్య, నారాయణ, సంకోజు రామకోటి, ఓంకారం, కంచర్ల బ్రహ్మచారి, సంకోజు హరిబాబు, సంకోజు సతీష్, పవన్, తరుణోజు విష్ణు వర్ధనాచారి, తరుణోజు సూర్య కళ, కోతోజు వెంకటమ్మ, కొత్తోజు వినోద్, గోపి, రమేష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సోమ యాదగిరితో పాటు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.