Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన కార్యదర్శి వెంకటేశం
నవతెలంగాణ-నల్లగొండ
ఈనెల 13, 14న హైదరాబాద్‌లో జరిగే యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పీ. వెంకటేశం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవనంలో జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులకు రావలసిన నాలుగు డీఏలు బకాయి ఉన్నాయి వాటిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు రంగారెడ్డి జిల్లా మన్నెగూడలోని బీఎన్ఆర్ సార్థ కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నామని, ఈ సభలకు విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా, కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ముఖ్య వక్తగా, పాల్గొంటారని తెలిపారు. ఈ మహాసభలో రాష్ట్ర విద్య రంగానికి సంబంధించిన తీర్మానాలు చేయనున్నట్టు చెప్పారు. మహాసభలకు ఉపాధ్యాయులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బక్క శ్రీనివాసచారి, కోశాధికారి నర్రా శేఖర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నర్రా సరళ, జిల్లా కార్యదర్శిలు సీహెచ్ రామలింగయ్య, జీ. నరసింహ, ఎం. శ్రీనివాస్‌రెడ్డి, వై. మధుసూదన్‌రెడ్డి, ఆర్. రమాదేవి, ఎన్.వెంకన్న, ఏ.చిన్న వెంకన్న, కే. కృష్ణారెడ్డి, యాదగిరి, ఆడిట్ కన్వీనర్ మురళయ్య, సభ్యులు నరసింహమూర్తి, పీ. సైదులు, చంద్రశేఖర్, మహిళా కన్వీనర్ సిహెచ్ వరలక్ష్మి, క్రీడా కమిటీ కన్వీనర్ బి.సురేందర్ రెడ్డి, కన్వీనర్ భాను ప్రకాష్ మరియు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.