Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
మునగాల పరగణా ప్రజల ప్రియతమ నేత ఉప్పుల కాంతారెడ్డి అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన కాంతా రెడ్డి బౌతికాయాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించారు. జమీందారి వ్యతిరేక పోరాటంలో తదనంతరం సాగిన విరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మునగాల పరగణాకు ఒక ప్రత్యేక చరిత్ర వుందన్నారు. అలాంటి పరగణా చరిత్రను కడదాకా నిలిపిన చరిత్ర కాంతారెడ్డికే దక్కుతుందన్నారు. బాల్యం నుండే పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని కొనియాడారు. మార్క్సిస్టు పార్టీని కంటికి రెప్పలా కాపాడటంలో కాంతరెడ్డి పాత్ర అద్వితీయమన్నారు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి తీరని లోటన్నారు. ధనిక రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులైయ్యారని తెలిపారు. జగన్నాధపురం గ్రామంలో కేశబోయిన ముత్తయ్య దగ్గర విద్యనభ్యసించి విప్లవ రాజకీయాలకు ఆకర్షితులైయ్యారని గుర్తు చేశారు. పార్టీలో అనేక బాధ్యతలు ని ర్వహిస్తూ సీపీఐ(ఎం) కోదాడ డివిజన్ కార్యదర్శిగా జిల్లా రైతు సంఘం నాయకుడి పనిచేశారని తెలిపారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ కాంతారెడ్డి ఈ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎనలేని కషి చేశొరని కొనియాడారు. ఎత్తి పోతల ద్వారా రైతాంగానికి సాగునీరం దించిన ఘనత ఆయనకే దక్కుతుంద న్నారు. ఎత్తిపోతల సమస్యల పై అనే క పోరాటాలకు నాయకత్వం వహించారని తెలి పారు.పేదల సమస్యల పరి ష్కారం కోసం శ్రమించారని చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కాంతా రెడ్డి జీవితం ఆదర్శనీయమన్నారు. నిర్బంధ విచిన్నాలను ఎదుర్కొని పార్టీని కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషించారని చెప్పారు. కామ్రేడ్ భీమిరెడ్డి నర్సింహారెడ్డి మల్లు స్వరాజ్యం మల్లం వెంకట నర్సింహారెడ్డి వంటి నాయకులతో సంప్రదిస్తూ పార్టీ పురోభివద్ధికి పొటుపడ్డారని తె లిపారు. ఆయన మతికి పార్టీ జిల్లా కమిటీ తరుపున సంతాపం తెలిపారు. కాంతారెడ్డి బౌతికాయాన్ని సందిర్శించిన వారిలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మ ల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే లు వేనేపల్లి చందర్రావు నలమాద పద్మావతి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు ములకలపల్లి రాములు, సిపిఐ సీనియర్ నాయకులు దొడ్డా నారాయణరావు, ఎకనామిక్స్ రీడర్ అందె సత్యం, రిటైర్డ్ ఐఎగస్ అధికారి బుర్రి రామయ్య, బిఆర్ఎస్ నాయకులు కన్మతరెడ్డి శశిధర్రెడ్డి, మునగాల ఎం పిపి యలకా బిందు నరేందర్రెడ్డి, వాసవీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ వంగవేటి వెంక ట గురుమూర్తి, సిపిఐ(ఎం)జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంక టేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి, నెమ్మాది వెంకటేశ్వర్లు, పల్లె వెంకటరెడ్డి, మిట్ట గణ్పుల ముత్యాలు, కోటా గోపి, కొలిశెట్టి యాదగిరి రావు, సిఐటియు నాయకులు సోమపంగు రాధాకకష్ణ, జుట్టుకొండ బసవయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి దేశిరెడ్డి స్టాలిన్రెడ్డి, మునగాల సింగిల్ విండో చైర్మెన్ కందిబండ సత్యనారాయణ, మునగాల సర్పంచ్ చింతకాయల ఉపేందర్, వివిధ మండ లాల పార్టీ కార్యదర్శులు బెల్లం కొండ సత్యనారాయణ, వట్టెపు సైదులు, రాపోలు సూర్యనారాయణ, మాజీ ఎంపిటిసి విజయలక్ష్మీ, కోదాడకు చెందిన పలువురు వైద్యులు కాంతారెడ్డికి పూ లమాలలు నివాళులర్పించారు. అంతకు ముందు కాంతారెడ్డి భార్య సక్కుబా యమ్మను, కుమారుడు డాక్టర్ శ్రీనివాసరెడ్డిని కుమార్తెలు అనంత లక్ష్మీ, విజయ లక్ష్మీలను పలువురు పరామ ర్శించి ఓదార్చారు.