Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండరూరల్
ఏండ్ల తరబడి గుంతల మయంగా ఉన్న రోడ్ల ప్రమాదాలకు గురై ప్రజలు మరణిస్తున్నారని, వెంటనే ముషంపల్లి నుండి నల్లగొండకు డబుల్ రోడ్డు వేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. సోమవారం సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ మండలంలోని వెలుగు పల్లి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పాలకులు మారిన రోడ్ల దుస్థితి మారడం లేదని, నల్లగొండ నుండి ముషంపల్లి, నిడమనూరు, త్రిపురారం, మాడుగుల పల్లి వెళ్లే దారి నిత్యం రద్దీగా ఉంటూ వందలాదిమంది ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లి వస్తుంటారని, అనేక మంది యాక్సిడెంట్లకు గురి చనిపోయారని కాలు చేతులు విరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. రోడ్డుకు నిధులు మంజూరు అయ్యాయని పదేపదే చెబుతున్నప్పటికీ పూర్తి చేయడంలో శ్రద్ధ కనబడడం లేదని తెలిపారు. వెలుగు పల్లి నుండి దుప్పలపల్లి రైల్వే బ్రిడ్జి వరకు రైతులు వరి ధాన్యం పత్తి నిత్యం మార్కెట్కు తరలిస్తారని నల్లగొండ మిర్యాలగూడ నకరికల్లు లో అత్యధికంగా మిల్లులు ఉండడం వలన ఆ దారి రద్దీగా మారిందని వెంటనే భేటీ డాంబర్ రోడ్డు గా మార్చాలని అన్నారు. మధ్యలో కోటప్ప ముత్తడి కాలువ వెంబడి కంచ లేకపోవడం వలన ఎలాంటి ప్రమాదం జరిగినా బతికే పరిస్థితి కనపడటం లేదని కాలువ ఒడ్డుకు కంచె ఏర్పాటు చేయాలని అన్నారు. అన్నారం అన్నరెడ్డిగూడెం వరకు గుంతల మయంగా మారిందని అనునిత్యం పాల వ్యాపారులు నల్లగొండకు పాలు తీసుకురావడం ప్రమాదాలకు లోన్ అవుతున్నారని ఆ రోడ్డును కూడా వెంటనే పూర్తి చేయాలని, ఈనెల 23న ముషంపల్లి నుండి నల్లగొండ కలెక్టరేట్ వరకు జరిగే పాదయాత్రలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నలుపరాజు సైదులు, సిపిఎం మండల కమిటీ సభ్యులు దొండా కృష్ణారెడ్డి, జిల్లా అంజయ్య, కండే యాదగిరి, భక్తుల బక్కయ్య, శ్రీనివాసు, వెంకటరెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.