Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18 నుండి నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ కేవీ.రమణచారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 48 వార్డులకు 48 మంది వార్డ్ అధికారులను, 8 మంది సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు. క్యాంపు ఏర్పాటు సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం, కుర్చీలు, బల్లాలు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ శాఖ, అధికారులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.