Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
ప్రజా వాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన అర్జీలు సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి సమస్యను పరిశీలించి తగు న్యాయం చేయాలని సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 42 ధరఖాస్తులను స్వీకరించడం జరిగిందని, వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలతో జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు వాటి పరిష్కారానికి ప్రాదాన్యతను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో తిరస్కరణకు గల కారణాలను వివరంగా తెలుపుతూ అర్జిదారునికి అందజేయాలని అధికారులను కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ది అధికారి, గృహ నిర్మాణశాఖ పి.డి.రాజ్ కుమార్, బీసీ సంక్షేమశాఖ అధికారిణి పుష్ప లత, ఎస్.సి.అభివృద్దిశాఖ అధికారిణి సల్మా భాను,మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బాల కృష్ణ, ఇతర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.