Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే దీక్షలు చేపడతాం
- ప్రజల ప్రాణాలు పోతుంటే చోద్యం చూస్తున్న ప్రజాప్రతినిధులు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
జాతీయ రహదారి 65 పామనగుండ్ల నుండి వయా పిట్టంపల్లి మీదుగా మర్రిగూడా బైపాస్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కట్టంగూరు మండలం పిట్టంపల్లిలో ప్రారంభమైన పాదయాత్ర బాదేగూడెం, చంద్రగిరి విలాస్ తాళ్లబాయిగూడెం, మర్రిగూడ బైపాస్, పెదగడియారం, ప్రకాశంబజార్, మిర్యాలగూడ రోడ్డు మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు నియోజకవర్గాలకు అనుసంధానం చేస్తూ తక్కువ సమయంలో జిల్లా కేంద్రానికి రావడానికి నార్కట్ల్లి, కట్టంగూర్, శాలిగౌరారం మండలాల గ్రామాల వారికి ఉపయోగకరమైన జాతీయ రహదారి 65 పాములగుండ్ల నుండి పిట్టంపల్లి మీదుగా మర్రిగూడా బైపాస్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంతల మయంగా ఉన్న ఈ రోడ్డుపై గతంలో అనేక ప్రమాదాలు జరిగి గాయాలపాలై మరణించిన ఘటనలు ఉన్నాయని ఆవేదన చెందారు. బస్సులు రాకపోవడంతో విద్యార్థులకు తీవ్ర ఆటంకం జరుగుతుందని, రైతులు దాన్యం అమ్ముకోవడానికి నల్లగొండకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజువారి దినసరి కూలీలు నల్లగొండకు ఉపాధి నిమిత్తం రావడం కోసం రోడ్డు రవాణా బాగాలేక ఆటోలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ, నకిరేకల్ ఎమ్మెల్యేలు నల్లగొండ, భువనగిరి ఇద్దరు ఎంపీలు ఉన్న ఈ రోడ్డుకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ఈ రోడ్డును పరిశీలించి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాధగూడం నుండి మర్రిగూడా బైపాస్ వరకు చర్లపల్లి చెరువు ఉన్నందున డబల్ సీసీ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ పామనగుండ్ల నుండి మర్రిగూడా బైపాస్ వరకు అనుసంధానంగా ఉన్న ఇస్మాంపల్లి రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో నల్లగొండ నుండి పామనగుండ్ల మీదుగా ఎరసానిగూడెం వరకు బస్సు వెళ్లేదని రోడ్డు బాగు లేకపోవడంతో బస్సులు ఆపివేశారని, ఎరసానిగూడెం వరకు మరమ్మత్తులు చేపట్టి ఆర్టీసీ బస్సు యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. తాల్లబాయిగూడెం నుండి చంద్రగిరి విలాస్ వరకు, చర్లపల్లి నుండి బాధగూడం వరకు లింకు రోడ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో జిల్లా కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాశమ్, నల్గొండ పట్టణ కార్యదర్శి ఎండీ. సలీం, కట్టంగూరు మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, పిట్టంపల్లి మాజీ సర్పంచ్ ఎన్న నర్సిరెడ్డి, నల్లగొండ మండల కార్యదర్శి నాలపరాజు సైదులు, నల్లగొండ పట్టణ, కట్టంగూరు మండల నాయకులు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, పిన్నపురెడ్డి మధుసూదన్‌రెడ్డి, వంగర సత్తయ్య, దండెంపల్లి సరోజ, ఊట్కూరు మధుసూదన్ రెడ్డి, కాసర్ల గౌతంరెడ్డి కోట్ల అశోక్ రెడ్డి, మురారి మోహన్ ఉడుగుడ్ల రామకృష్ణ , జాల ఆంజనేయులు, పెంజర్ల కృష్ణ, గుండాల నరేష్, గంజి నాగరాజు, మాదా సైదులు, ఎన్నామల్ల నర్సింహ , గోలి స్వామి, దెవెంద్ర బాబు, గుండమల్ల బిక్షం, ఉమారాణి, మంజుల సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) పాదయాత్రకు పలు పార్టీల మద్దతు...
పామనగుండ్ల నుండి మర్రిగుడా బైపాస్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) నల్లగొండ పట్టణ, కట్టంగూరు మండల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాచార హక్కుకు సాధన సమితి నాయకులు, మాజీ ఎంపీపీ కొండ లింగస్వామి, మాజీ పీిఎసీఎస్ అధ్యక్షులు షోగోని సాయిలు, గాదపాక సందీప్, కేశవులు, ఎన్న వెంకట్‌రెడ్డి, గాదపాక మధు, నజీర్‌లు మద్దతు ప్రకటిస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు.
నల్లగొండకు డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి
పాదయాత్రను ప్రారంభించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-కట్టంగూరు
జాతీయ రహదారి 65 నుండి పామనగుండ్ల, ఇస్మాయిల్పెళ్లి, పిట్టంపల్లి మీదుగా నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మండలంలోని పిట్టంపల్లి గ్రామం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన పాదయాత్రను సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. జిల్లా కేంద్రమైన నల్లగొండకు వెళ్లేందుకు కట్టంగూరు, నార్కట్‌పల్లి, శాలిగౌరారం మండలాలకు చెందిన 20 గ్రామాల ప్రజలు నిత్యం ఈ రహదారి గుండా వెళ్తారని ప్రస్తుతం ఉన్న రహదారి పూర్తిగా గుంతల మయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నకిరేకల్ నలగొండ నియోజకవర్గాలను అనుసంధానం చేస్తూ ఉన్న ఈ రోడ్డును డబల్ రోడ్డు చేయడం ఎంతగానో అవసరమన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు అద్వాన స్థితిలో ఉండడంతో అనేక ప్రమాదాలు జరిగి చాలామంది ప్రయాణికులు గాయాల పాలయ్యారని అన్నారు. రోజువారి దినసరి కూలీలు, రైతులు ఉపాధి కొరకు నల్లగొండకు వెళ్తారని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఈ రోడ్డుని పట్టించుకోవడం లేదని అందుకే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. కలెక్టర్ తక్షణమే ఈ రోడ్డును పరిశీలించి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో సిపిఎం మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, పిట్టంపల్లి మాజీ సర్పంచ్ ఎన్నా నర్సిరెడ్డి, మండల కమిటీ సభ్యులు మురారి మోహన్, కక్కిరేణి రామస్వామి, మాద సైదులు, గుడిగుంట్ల రామకష్ణ, దండంపల్లి శ్రీను, నాగులపాటి మల్లేష్, కారింగు మల్లేష్, ఇస్మాయిల్ పెళ్లి శాఖ కార్యదర్శి పెంజర్ల కృష్ణ, పిట్టంపల్లి శాఖ కార్యదర్శి గోలి స్వామి, పెంజర్ల దేవేందర్, చిలుకూరు సైదులు, ముస్కు రవీందర్ పాల్గొన్నారు.
పాదయాత్రకు పలు పార్టీల మద్దతు
65 జాతీయ రహదారి నుండి నల్లగొండ మర్రిగూడ బైపాస్ రోడ్డు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఐ(ఎం) చేపట్టిన పాదయాత్రకు పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులుతో పాటు సమాచార హక్కు సాధన సమితి మద్దతు ప్రకటించి పాదయాత్రలో పాల్గొన్నారు.