Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏంఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షులు కత్తి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ-హలియా : టీవీ పే ఛానల్ రేట్లు పెంచి సామాన్యులపై భారాల మోపుతూ ట్రారు తీసుకునే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేబుల్ ఆపరేటర్ల జిల్లా ఉపాధ్యక్షులు కత్తి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం హాలియాలో స్థానిక గెస్ట్ హౌస్‌లో జరిగిన కేబుల్ ఆపరేటర్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా కేబుల్ రంగంలో లక్షకుపైగా ఆపరేటర్ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, పరోక్షంగా మరో లక్ష కుటుంబాలు ఆధారపడుతున్నాయని, వీరి పొట్ట కొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేప పడుతుందన్నారు. సెటప్ బాక్స్‌లు రావడంతో కేబుల్ ఆపరేటర్ల జీవన ఉపాధి దెబ్బతిన్నదని అనేకమంది ఆత్మహత్యల గురైనరని తక్షణమే వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ట్రారు నిర్ణయాలు ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు మాట్లాడుతూ మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పూర్తిగా విస్మరించి స్వయం ఉపాధి పొందుతున్న కేబుల్ ఆపరేటర్ల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని, కేబుల్ ఆపరేటర్లకు అండగా ఉండి వారి ఉద్యమానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో కేబుల్ ఆపరేటర్ల జిల్లా నాయకుడు తోటిపల్లి కొండల్, ఆపరేటర్లు హైమద్ అలీ, ఆంజనేయులు, శ్రావణ్, శంకర్, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.