Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ప్రజారోగ్యంలో భాగంగా ప్రజలందరికీ త్వరితగతిన బూస్టర్ డోస్ వెయ్యాలని ఎంపీపీ బచుపల్లి శ్రీదేవి గంగాధర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు బాల బాలికల సమస్యల నిర్మూలనకు జిల్లా నుండి వచ్చిన సదరధికారికి తక్షణమే బాలల పరిరక్షణ కమిటీలు వేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో లక్ష్మారెడ్డి, ఎంపీఓ నాగలక్ష్మి, ఎంపీటీసీలు సామ మల్లమ్మ, గాధగోని శ్రీలత, దాసరి వీరార్జున్ రెడ్డి, లోడే సాగర్, బోయిల కిషోర్, కోఆప్షన్ సభ్యులు కాసింఖాన్, సర్పంచులు పగడాల సైదులు, మాలే నవీన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.