Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మునుగోడు
మండలంలోని కిష్టాపురం గ్రామ రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 356, 357/1 లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సన్ లైట్ ఆక్టివ్ డ్రగ్ ఇంగ్రిడియంట్స్ ప్రయివేటు లిమిటెడ్ ఫార్మా కంపెనీ ఏర్పాటుకు చేపడుతున్న పనులు నిలిపివేయాలని కంపెనీకి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజాప్రతినిధులు మంగళవారం ధర్నాకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మా కంపెనీల ఏర్పాటుకు గ్రామపంచాయతీ అనుమతులు ఇవ్వకుండా వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం అనుమతులు జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. ఫార్మా కంపెనీ ఏర్పాట్ను వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతారని, ఇట్టి నిర్మాణం పూర్తి చేసి కంపెనీ ప్రారంభం అయినట్లయితే, అక్కడ మా గ్రామానికి చెందిన రైతులు పంటపొలాలు దెబ్బతింటాయని అన్నారు . ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసే చుట్టుపక్కల వాగు ప్రవహిస్తుందనీ, ఈ వాగులోని నీటిలో రసాయన కలుషితాలు చేరి కిష్టాపురం గ్రామంలోని పెద్ద చెరువులోకి చేరుతుంది,దీనివల్ల చెరువులోని మత్స్య సంపద దెబ్బతిని మత్స్యకారులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.ఈ కంపెనీ వెదజల్లే పొగ వల్లన గాలి కాలుష్యం ఏర్పడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో గ్రామంలో నివాసం ఉండలేక గ్రామస్తులు వలస వెళ్ళే అవకాశం వున్నది.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు భీమనపల్లి సైదులు, చెరుకు కృష్ణయ్య , సర్పంచ్ లు బొజ్జ సుజాత శ్రీను, జాజుల పారిజాత సత్యనారాయణ, సర్వేల్ సర్పంచ్ బిక్షపతి, మల్లారెడ్డిగూడెం సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, గుజ్జ సర్పంచ్ మైల యాదిరెడ్డి, ఉప సర్పంచ్ ఆకుల అనిల్ ,బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు భవన శ్రీనివాస్ రెడ్డి ,దాడి శ్రీనివాస్ రెడ్డి,వివిధ గ్రామాల ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు.