Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
సీఎంఆర్ఎఫ్ పేదలకు ఊరం లాంటిదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.మంగళవారం క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మిర్యాలగూడ నియోజకవర్గవ్యాప్తంగా 60మంది లబ్దిదారులకు మంజూరైన రూ.29.09 లక్షల విలువ గల చెక్కులను అంద జేసినట్టు తెలిపారు.అనారోగ్యంగా ఉన్న పేదలు మెరుగైన వైద్యం పొందేందుకు ఈ పథకం ఉపయోగ పడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, నల్గొండ రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రైతు బందు సమితి సభ్యులు వీరకోటి రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గం పూడి నారాయణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, నాయకులు అంగోతు హతిరాంనాయక్, ఎం.డి యూసుఫ్, ధీరావత్ రవితేజ, ఇరుగు వెంకటయ్య, పోకల రాజు, వేములపల్లి మండల పార్టీ అద్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ జేర్రిపోతుల రాములు గౌడ్, పాదురి సంజీవ్ రెడ్డి, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, స్థానిక కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.