Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
జీవనోపాధి కోసం వివిధ రాష్ట్రాల నుండి వస్తున్న వలస కార్మికులకు కనీస వేతనాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్లో జిల్లా వ్యాప్తంగా వివిధ రైస్ మిల్లులో పనిచేస్తున్న వలస కార్మికుల మేస్త్రీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ యాజమాన్యాలు వలస కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కూలి రేట్లు తక్కువ ఇస్తూ వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. లేబర్ అధికారులు జిల్లా కలెక్టర్ వలస కార్మికుల పని ప్రదేశాలను సందర్శించి వాళ్లకు అందాల్సిన వసతులు అందే విధంగా యాజమాన్యాలకు సూచించాలని కోరారు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి నష్టపరిహారం లేకుండా పార్థివ దేహాలను సొంత రాష్ట్రాలకు కూడా తీసుకపోలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వలస కార్మికుల సామాజిక భద్రత చట్టం ప్రకారం వారికి రవాణా ఖర్చులు నివాసయోగ్యమైన స్థలాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉన్నదని అన్నారు. సందర్భంగా రైస్ మిల్ వలస కార్మికుల కన్వీనింగ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్ గా సూరజ్ పటేల్ కో కన్వీనర్స్ గాసందీప్ కుమార్ , గణేష్ పటేల్, రామ్ పటేల్ , సభ్యులు గా దిలీప్, అభిమన్యు ,రణధీర్ కుమార్, పూలన్ సింగ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, అవుట సైదులు, జిల్లా సహాయ కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య, కానుగు లింగస్వామి, హమాలీ ఫెడరేషన్ నాయకులు సాగర్ల యాదయ్య ,గుణ గంటి రామచంద్రం ,సూరజ్, నెలకొంది రాసి లింగయ్య ,తాడ్వాయి రాములు, పూలన్ సింగ్ ,గణేష్ పటేల్ ,రామ్ పటేల్ ,రణధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.