Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
నవతెలంగాణ-పెద్దవూర
అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు.మంగళవారం మండలకేంద్రంలో గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆహ్వానం మేరకు విద్యార్థులకు నూతన బ్యాగులు, ట్రంక్ బాక్సులు, షూలు పంపిణీ చేశారు.విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల విద్యాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమన్నారు.తెలంగాణ రాష్ట్రం వచ్చాక నిరుపేదలైన షెడ్యూల్ కులాలు, తెగలు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు అన్ని వర్గాలకు గురుకులాలను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. ఒక్క విద్యార్థికి లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేయడం గొప్ప విషయమని, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్‌రెడ్డి, తిరుమలగిరి సాగర్ ఎంపీపీ భగవాన్‌నాయక్, సర్పంచ్ నడ్డి లింగయ్యయాదవ్, ఎంపీటీసీ కృష్ణారావు, పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.