Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే భగత్‌కుమార్
నవతెలంగాణ-పెద్దవూర
విద్యార్థులకు తాజా కూరగాయలతో నాణ్యమైన భోజనం అందించాలని నాగార్జునసాగర్ ఎంఎల్ఏ నోముల భగత్ అన్నారు.సోమవారం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈసందర్భంగా పాఠశాలలో భోజనం అందుతున్న తీరును, విద్యాబోధన జరుగుతున్న విధానాన్ని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థినులతో కాసేపు ఆత్మీయతతో వారి విద్యాభ్యాసంపై ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ నీళ్లను విద్యార్థులకు అందించాలని అన్నారు.అవసరమైతే తాగునీరు వేడి చేసి విద్యార్థులకు ఇవ్వాలన్నారు.వంటగది పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.అనంతరం పాఠశాల ఆవరణవంటగదులు,విద్యార్థుల బెడ్రూమ్లు పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ గుటుక వెంకటరెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, వాసుదేవుల సత్యనారాయణరెడ్డి, మెండే సైదులు,రాజేష్‌నాయక్, శివాజీనాయక్, మల్లికార్జున్,తదితరులు పాల్గొన్నారు.