Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ పట్టణంలోని చందన స్కూల్లో గురువారం విద్యార్థులు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పతంగులు, ముగ్గులపోటీలు, బోగి మంటలు ఘనంగా నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అవ్వారు రామేశ్వరి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వప్న, నర్మద, పద్మ, రేణుక, నిర్మల, అర్చన, జగదీశ్వరి, సౌమ్య, గీత పాల్గొన్నారు.
గ్రీన్గ్రోవ్లో.. చౌటుప్పల్ పట్టణంలోని గ్రీన్‌గ్రోవ్ పాఠశాలలో గురువారం సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగులతో ముగ్గులను అలంకరించారు. విద్యార్థులు హరిదాసుల వేషధారణతో అందరిని అలరించారు. బోగి మంటలు వేశారు. పాల కడవల్లో పాలను పొంగించారు. విద్యార్థులు గాలిపటాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఛైర్మన్ బండి వీణఅనిల్కుమార్రెడ్డి, డీన్ ఎల్.సతీశ్‌రెడ్డి, డైరెక్టర్ లక్ష్మీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కృష్ణవేణిలో.. చౌటుప్పల్ పట్టణంలోని కృష్ణవేణి హైస్కూల్లో గురువారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులకు ముగ్గులు, గాలిపటాల పోటీలు నిర్వహించారు. బోగి మంటలు వేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ గుత్తా గోపాల్‌రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా కవిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శాంతినికేతన్లో ..సంబరాలు
భూదాన్‌పోచంపల్లి : పట్టణ కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు ప్రజల సంస్కృతీ సాంప్రదాయమైన సంక్రాంతి పండుగ వేడుకలలో భాగంగా భోగి పండుగ, గొబ్బమ్మలు, భోగి మంటలు తో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్రాంతి ప్రత్యేకగ..హరిదాసు వేషధారణ పలువురినిఆకట్టుకున్నాయి. .అనంతరం విద్యార్థినులు గాలిపటాలను ఎగరవేశారు. రంగురంగులతో వివిధ రూపాలతో ముగ్గులను వేశారు. గలుపొందిన వారికి పాఠశాల యజమాన్యం తిరుమల్ రెడ్డి, దామోదర్ రెడ్డి బహుమతులను ప్రధానం చేశారు. మాట్లాడుతూవిద్యార్థులు ఐకమత్యంగా తెలుగు ప్రజల సంప్రదాయానికి ప్రతీకైనా భోగి సంక్రాంతిని ఆనందంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం శ్యామల సుధా లలిత డి సుధా శారద సంధ్య రవళి సునీత.సంతోష అంకిత పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు
ఆలేరుటౌన్ : మండల కేంద్రంలో గురువారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి కీడోత్సవాల సందర్భంగ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బాలుర ఉన్నత పాఠశాలలో పరుగు పందెం, ముగ్గుల పోటీలు ,అదేవిధంగా బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలు ఇతర క్రీడలు నిర్వహిస్తుందని తెలిపారు. ఆలేరు ప్రభుత్వ పాఠశాలలో ముగ్గులపోటీలో దాదాపుగా 50 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ు ఉపాధ్యాయురాలు నీరజ, శ్యాంసుందరి,స్వర్ణ లత పరుగు పందెం పరిశీలనకు హరినాథ్ రెడ్డి,మంద సోమరాజు,శేఖర్ పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో బొనగిరి గణేష్ మండల అధ్యక్షులు కందుల నాగరాజు ఉపాధ్యక్షులు కంతి విక్రం సభ్యులు ఆదె సుర్జిత్,ఉదరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
వలిగొండరూరల్ : మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామంలో ఏజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఏజెఆర్ ఫౌండేషన్ చైర్మెన్ ఎలిమినేటి జంగారెడ్డి లలితా దంపతులు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతి అందజేశారు.మొదటి బహుమతి వట్టిపల్లి నవనీతకు 5016 రూపాయలు,రెండవ బహుమతి బండారి మనీషా కు 4016,మూడవ బహుమతి బోడ్డుపల్లి శ్రావణికి 3016,నాల్గవ బహుమతి శ్యామల జ్యోతికి 2016,ఐదవ బహుమతి దుబ్బ మౌనికకు 1016 రూపాయల ను అందజేశారు.అనంతరం ముగ్గుల పోటీలో పాల్గొన్న 69 మందికి ఏజెఆర్ ఫౌండేషన్ మేమొంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలిమినేటి మనోజ్ రెడ్డి,మనిత్ రెడ్డి,ఉప సర్పంచి బండారి నరేష్,వార్డు మెంబర్లు వెంకట్ రెడ్డి, బండారి అనిత,శ్యామల జ్యోతి,మాజీ ఎంపీటీసీలు బద్దం బాగ్యమ్మ,వనగంటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.