Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
మండలం లోని పలు గ్రామాల్లో ఈనెల 18 నుండి మొదలుకొని 99 రోజుల వరకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని మండల ఎంపీపీ గంధ మల్ల అశోక్ తెలిపారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కంటి వెలుగు పై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మొత్తం 99 రోజులు కొనసాగుతుందని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన వారికి స్కానింగ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు ,ఎంపీ ఓ సలీం ,డాక్టర్ నవీన్ కుమార్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
భువనగిరి రూరల్ : కంటివెలుగుపై మండలంలోని బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల ప్రజా ప్రతినిధులకు, వైద్య ఆరోగ్య సిబ్బందికి గురువారం ఎంపీడీవో సమావేశ మందిరంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కంటి వెలుగు శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జడ్పిటిసి సుబ్బూరు బీరు మల్లయ్య, జడ్పీ డిప్యూటీ సిఈ ఓ శ్రీనివాసరావు, ఎంపీడీవో గుత్తా నరేందర్ రెడ్డి, మండల ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ యామిని, ఎంపీఓ అనురాధ దేవి,తదితరులు పాల్గొన్నారు.