Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
వక్ఫ్ బోర్డు భూములు సంరక్షించాలని కోరుతూ మండల కేంద్రంలో గురువారం తహసిల్దార్ కార్యాలయం ఎదుట వక్ఫ్ బోర్డు కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షుడు ఎంఏ ఇక్బాల్ మాట్లాడుతూ మండలంలోని కొలనుపాక లోని ,సర్వే నెంబర్ 1646, 1647 లోని 14 ఎకరాల భూమిని కొంతమంది ప్రయివేటు వ్యక్తులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో భూమి విషయంలో హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ,తీర్పును అమలు చేయడంలో రెవెన్యూ ,పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించి భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ అధికారి ఆర్ఐ కిస్టుకి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మస్జిద్ అధ్యక్షులు సయ్యద్ మజర్ ,అఖిలపక్ష కో కన్వీనర్ ఎండి.సలీం, మంగా నర్సింహులు ,జూకంటి పౌలు , మహమ్మద్ ఇబ్రహీం, అబ్దుల్ ,నయీమ్, మహమ్మద్ ,ఉస్మాన్, నయ్యద్, అక్బర్ ,మహమ్మద్ ,రసూల్, మహమ్మద్ ,హబీబ్, మహమ్మద్, సమీర్, గౌస్ పాషా, ఎండి అజ్మత్ ,ఎండి బద్రుద్దీన్ పాల్గొన్నారు.