Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12మందికి గాయాలు,ముగ్గురు పరిస్థితి విషమం
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
ఒకవైపు రోడ్డు భద్రత వారోత్సవాలు .. మరోవైపు డ్రైవర్లు భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. వేరసి అమాయక ప్రయాణికుల కుటుంబాల్లో తప్పనిశోకం. ఓ ప్రయివేటు బస్సు డ్రైవర్ బస్సును అతివేగంగా నడుపుతూ ఆపి ఉన్న మరో ప్రయివేటు బస్సును వెనక నుండి ఢ కొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి వద్ద జాతీయ రహదారి-65పై గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ఇలా... హైదరాబాదు నుండి విజయవాడ వైపు వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సు గుండ్లబావి స్టేజి వద్ద రోడ్డు పక్కన ఆపి ఉంచారు. విజయవాడ వైపు వెళ్తున్న మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు వెనక నుండి బలంగా ఢ కొట్టింది. డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలానికి చౌటుప్పల్ పోలీసులు చేరుకొని జాతీయ రహదారికి అడ్డుగా ఉన్న ట్రావెల్స్ బస్సులను క్రేన్ సహాయంతో తొలగించారు. గాయపడిన ప్రయాణికులను చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం ఎవరికి ఎలాంటి ప్రాణహాని లేదని పోలీసులు చెప్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.