Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారని, విధులకు ఆటంకం కలిగించారని నీపై కేసు పెడ్తామని బెదిరింపులు
- సమయపాలన పాటించని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం సిబ్బంది
- ఇబ్బందులు పడుతున్న రోగులు
- జిల్లా వైద్యాధికారుల అన్నదండలతోనే ఇలా చేస్తున్నారని ఆరోపణలు?
నవతెలంగాణ-చివ్వెంల
రోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నాణ్యమైన వైద్యం అందించాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి రోజూ ఆస్పత్రికి వచ్చి రోగులను చూడాల్సిన వారు చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు.ఇందేటని ప్రశ్నిస్తే తమకు జిల్లా వైద్యాధికారుల నుంచి సత్సంబంధాలు ఉన్నాయని , వారికి ఇవ్వాల్సిన ముడుపులు అందిస్తున్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేరని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమాధానం చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.సాక్షాత్తు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సమయపాలన పాటించకపోవడంతో సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి.ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాథమికఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంది.కానీ మండలకేంద్రంలోని ప్రాథమికఆరోగ్యకేంద్రంలో మాత్రం సిబ్బంది, వైద్యాధికారి తన ఇష్టమొచ్చిన సమయంలో హాస్పిటల్కు వచ్చి ఒకట్రెండు ఓపీలు చూసి తన సొంత పనుల పైన తిరిగి వెళ్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.వివిధ అనారోగ్య కారణాలతో ప్రభుత్వహాస్పిటల్కు వచ్చిన రోగులకు డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో స్థానిక సిబ్బంది డాక్టర్ చూడకుండానే మందులు ఇచ్చేసి పంపుతున్నారని పలువురు హాస్పిటల్కు వచ్చిన రోగులు ఆరోపిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన రోగులకు వైద్యం అందించాలనే లక్ష్యంతో మండలం కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం ఈ ఆస్పత్రికి సుమారు 50నుంచి 70మంది రోగులు ఓపీకి వస్తూ ఉంటారు. వైద్యులు, సిబ్బంది ఆస్పత్రిలో రోగులకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ ఆస్పత్రికి గతంతో రోజుకు 80 నుండి 100 మంది రోగులు ఓపీకి వచ్చేవారు. వైద్యుడు నిత్యం గైర్హాజరు కావడంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగాతగ్గిందని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్యాధికారి విధులకు రాని రోజు ఆస్పత్రిలో స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్టులు మాత్రమే రోగులకు నామమాత్రపు వైద్య సేవలందిస్తున్నారు.ఈ క్రమంలో గురువారం నవతెలంగాణ విలేకరి ఆస్పత్రిని సందర్శించారు.ఆ సమయంలో ఆస్పత్రిలో ఎవరూ లేకపోవడం మున్యానాయక్తండా నుంచి మహిళ డాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంది.రోగం వస్తే చూపించుకుందామని ఆస్పత్రికి వస్తే ఎవరూ ఉండడం లేదని పలువురు రోగులు నిరాశతో వెనుదిరిగి పోవడం కన్పించింది.హాస్పిటల్కు సంబంధించిన ఓ సిబ్బందితో వివరణ అడగగా హాస్పిటల్ పైన వార్త రాస్తే 'నీపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని.. సిబ్బంది విధులకు ఆటంకం కలిగించావని..వారితో అసభ్యంగా ప్రవర్తించాలని నీపై కేసు పెడతామని బెదిరించడంతో పాటు నీవు ఏ వార్త రాసిన మాకు అధికార పార్టీ రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని' జిల్లా వైద్యాధికారి కూడా మమ్మల్ని ఏమీ చేయలేడని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది.మండలకేంద్రంలోని వైద్య సిబ్బందే సమయానికి విధులకు రాకపోతే మారుమూల గ్రామాల్లో విధులు నిర్వహించే డాక్టర్లు ఏ సమయానికి విధులకు వెళ్తారో అర్థం కాని పరిస్థితి.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటారా లేక వారికే వత్తాసు పలుకుతారో చూద్దాం.
గ్రామాల్లో అందుబాటులో ఉండని ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు?
మండలవ్యాప్తంగా ఫస్ట్ ఏఎన్ఎంలు ఏడుగురు, రెండో ఏఎన్ఎంలు ఆరుగురు, ఆశా కార్యకర్తలు 44 మంది విధులు నిర్వహిస్తున్నారు. కానీ వారు ఆయా గ్రామాల్లో విధులు పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.ముఖ్యంగా గర్భిణుల పట్ల ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం కాక వారి పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నాని, గర్భిణుల నమోదు సరైన సమయంలో చేయకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు వారికి రావడం లేదని ఆరోపిస్తున్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యంవహిస్తే చర్యలు తీసుకుంటాం
డీఎంహెచ్ఓ-కోటాచలం
మండలకేంద్రంలోని వైద్యాధికారితో పాటు సిబ్బంది సమయపాలన పాటించాలి.సమయపాలన పాటించకపోవడం పట్ల పూర్తి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం.