Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-తుంగతుర్తి
దేశచరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి, ఆధ్యాత్మిక నాయకుడు, తత్వవేత్త రచయిత, దేశానికి మార్గదర్శి స్వామి వివేకానంద అని సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. గురువారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. భారతీయ విలువలను ప్రపంచానికి ప్రచారం చేసిన గొప్ప మేధావి స్వామివివేకానంద అన్నారు.రక్తదానం ప్రాణదానంతో సమాన మన్నారు.రక్తదానంపై ప్రజలు అవగాహన పెంచుకొని స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.శిబిరంలో 82 మంది రక్తందానం చేశారన్నారు.నీతి, నిజాయతీ ధైర్యంతో ప్రతివ్యక్తి ముందడుగు వేయాలన్నారు.స్వామి వివేకానంద స్ఫూర్తితో సేవాభావం అలవర్చుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం, సీఐలు నాగార్జునగౌడ్,రాకేష్, ఎస్సైలు డానియల్‌కుమార్, వెంకన్న, వై.ప్రసాద్, సిబ్బంది గోపినాయక్, సైదులు, బాబర్, సుధాకర్, రవి తదితరులు పాల్గొన్నారు.