Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతలపాలెం
చేపల ప్యాకింగ్ మార్కెటింగ్ అంశాలను గడ్డిపల్లి కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.లవకుమార్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపలను పట్టుబడి చేసిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో ఐస్ వేసి చేపలను తెర్మోకోల్ డబ్బాలలో ప్యాక్ చేసి, మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా చేపల నాణ్యతను కాపాడుకోవచ్చన్నారు.గురువారం చింతలపాలెంలోని చింతిరాల వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్న చేపలను ఐస్ ప్యాకింగ్ యూనిట్‌ను కేవీకే శాస్త్రవేత్తలు సీహెచ్.నరేష్, డి.ఆదర్శ్‌లతో కలిసి సందర్శించి పరిశీలించారన్నారు. ఐస్ప్యాకింగ్ చేయడం ద్వారా చేపలను 28 నుండి 36 గంటలవరకు తాజాగా ఉంచవచ్చన్నారు. రిజర్వాయర్‌లో నుండి పట్టుబడి చేసిన తర్వాత వెంటనే ఐస్ ప్యాకింగ్ యూనిట్‌కు చేరవేసి శుభ్రమైన ఐస్‌తో కలిపి బాక్స్‌లో నింపి, దూరప్రాంతాలకు సరఫరా చేయడం ద్వారా అధిక ధరను పొందొచ్చన్నారు. ఐస్తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే చేపల పట్టుబడి చేసే వారికి వెంటనే మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద షెడ్యూల్డ్ కులాల వారికి ఐస్ తయారి యూనిట్ ఏర్పాటు కు సబ్సిడీ కింద ఏర్పాటు చేసుకొనేందుకు అవకాశం ఉందని జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి ఆఫీస్‌ను సంప్రదించాలని సూచించారు.చేపల పెంపకంపై అసక్తి గల రైతులకు కేవీకేలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.జిల్లావ్యాప్తంగా నీటివనరుల లభ్యత పెరగడంతో చాలామంది చేపల పెంపకం చేపట్టారని, సరైన మార్కెటింగ్‌పై దృష్టి పెట్టడం ద్వారా అధికధరను పొందవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఏలేటి బ్రహ్మానందం, బొంగరాల వెంకటేశ్వర్లు, మార్తమ్మ, అల్లూరి రామరాజు తదితరులు పాల్గొన్నారు.