Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
ప్లాస్టిక్ నిషేధంపై మండల పరిధిలోని గడ్డిపల్లి కేవికేకు గ్రామీణ కృషి అనుభవం కోసం విచ్చేసిన లయోలా కాలేజీ విద్యార్థినులు గ్రామంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా స్కూల్ నుండి గ్రామంలోని సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.ప్లాస్టిక్ సంచులు మన పర్యావరణానికి ముప్పుగా ఉన్నందున వాడవద్దన్నారు.వాటిల్లో పునరుత్పాదక పెట్రోల్ కెమికల్స్ ఉండడం వలన ప్లాస్టిక్ సంచులు ఎక్కువకాలం ఉండి మన ప్రకృతిని దెబ్బతీస్తాయన్నారు.ప్లాస్టిక్ సంచులు ఉపయోగించడం వలన జరిగే సమస్యలు ముఖ్యంగా కాలువలు మూసుకుపోవడం, భూగర్భజలాల కాలుష్యం మొదలైన వాటితో పాటు విచక్షణారహితంగా ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణ సమస్యలు కలుగు తాయన్నారు.ప్లాస్టిక్ కవర్లు మూగజీవాల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతు న్నాయన్నారు.ఈ ప్లాస్టిక్ వల్ల పశువులు అకస్మాత్తుగా మరణం బారిన ఎక్కువగా పడుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కేవీకే ఇన్చార్జి ఎన్.సుగంధిగృహవిజ్ఞాన శాస్త్రవేత్త, లయోలా కాలేజ్ విద్యార్దినిలు కె.శృతి, వి.శ్రియ, పి.మౌనిక, వి.రమాదేవి, వి.తేజశ్రీ, వి.శ్రావణి, వి.ధనలక్ష్మి, కె.హర్షిణి పాల్గొన్నారు.