Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామ ఉపసర్పంచ్‌పై పెట్టిన అవిశ్వాసంవీగిపోవడం ఎమ్మెల్యేకు చెంపపెట్టు లాంటిదని కాంగ్రెస్ మండలఅధ్యక్షులు దొంగరి గోవర్ధన్ అన్నారు.గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.ఈ మేరకు అన్నారం గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో 12 వార్డులకు గాను కాంగ్రెస్ ఎనిమిది వార్డులు, బీఆర్ఎస్ నాలుగు వార్డులు గెలుపొందాయన్నారు.ఉపసర్పంచ్‌గా కాంగ్రెస్‌కు చెందిన ఉప్పుల నిర్మల ఎన్నికైందన్నారు.ఈ మధ్యకాలంలో అన్నారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పెద్దమనిషి ఎమ్మెల్యే మెప్పు పొందడం కోసం ముగ్గురు దళిత వార్డుల సభ్యులకు దళితబంధు ఇస్తామని మభ్యపెట్టి బీఆర్ఎస్లోకి చేర్చుకున్నారన్నారు.ఇటీవల ఆర్డీవో దగ్గర అవిశ్వాసాన్ని ప్రకటించి గురువారం అవిశ్వాసం పెట్టడం జరిగిందని ఆ తీర్మానం వీగిపోయిందన్నారు.కోరం లేకపోవడం చేత ఉపసర్పంచ్ మీద పెట్టిన అవిశ్వాసం వీగిపోయిందన్నారు.అన్నారం సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక దగ్గర నుండి నిజాయతీగా గ్రామంలో ప్రజలందరి సమస్యల మీద స్పందిస్తూ వచ్చిన నిధులను సద్వినియోగం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పనులు చేయడం జరుగుతుందన్నారు.ఎవరో ఒకరి స్వార్థం కోసం ఎమ్మెల్యే మెప్పు పొందడం కోసం నిజాయతీ గల సర్పంచ్ మీద మొదటి నుంచి కక్షగట్టి దళితుడైన సర్పంచ్ మిట్టగడుపుల అనోక్ అనేకసార్లు అవమానపరుస్తూ తాను చెప్పినట్లు వినాలని చెప్పి శాసిస్తూ ఒత్తిడి తీసుకురావడం జరిగిందన్నారు.కానీ అన్నారం గ్రామస్తులు,కాంగ్రెస్ కార్యకర్తలు, వార్డు సభ్యులు చైతన్యంతో మెదులుకొని ఈరోజు బీఆర్ఎస్ పెట్టినవిశ్వాస తీర్మానాన్ని వాకౌట్ చేయడం ద్వారా వారు పెట్టిన అవిశ్వాసం వీగిపోయిందన్నారు. ఇకనైనా ఏ పార్టీ వారైనా సమైక్యంగా గ్రామ అభివృద్ధి కోసం గ్రామానికి వచ్చిన నిధులను సద్వినియోగం చేస్తూ పనిచేయాలన్నారు.ఈరోజు గతంలో ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించడం కోసం ఒక వ్యక్తి స్వార్థం కోసం గ్రామంలో అలజడి రేపి సంతోషపడాలని చూస్తున్నందున ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు.