Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-సూర్యాపేట
1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను స్వాతంత్య్రసమరయోధులుగా గుర్తించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బొమ్మిడి లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఈనెల 16న స్థానిక కిరాణామర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్‌లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశానికి రాష్ట్ర నాయకులు, కార్యవర్గ సభ్యులతో పాటు, వివిధ నియోజకవర్గంలోని ఉద్యమకారులు సకాలంలో విచ్చేసి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు నీలకంఠ చలమంద, ప్రధాన కార్యదర్శి సీహెచ్. విశ్వేశ్వర్రావు, కోశాధికారి నరేంద్రునివిద్యాసాగర్రావు, గౌరవ సలహాదారులు హమీద్‌ఖాన్, సంతోష్‌రెడ్డి, వెంకటయ్య, ఉన్నం సత్యనారాయణరావు, కిషన్‌నాయక్, దేవరశెట్టి నారాయణ, సాంబయ్య, చిత్రం భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.