Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ఈనెల 27 నుండి 31 వరకు కేరళలో జరిగే దక్షిణ భారతదేశస్థాయి ప్రదర్శనకు ఉపాధ్యాయుడు షేక్జాఫర్ ఎంపికయ్యారు.ఉన్నత పాఠశాలస్థాయిలో భౌతికశాస్త్ర బోధనకు ఉపయోగపడే వివిధ బోధనాభ్యాసన సామగ్రి తయారీ, విశ్లేషణకు సంబంధించి టీచర్స్ విభాగంలో 33 జిల్లాల నుండి రాష్ట్రస్థాయిలో జనవరి 9, 10, 11వ తేదీలలో నిర్మల్ జిల్లాలో సైన్స్‌ఫేర్ నిర్వహించారు.ఇక్కడ ఉత్తమప్రతిభ ప్రదర్శన కనబరిచిన వారిని కేరళలో జరగబోయే దక్షిణ భారత దేశస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేశారు.ఈ క్రమంలో మునగాల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా చేస్తున్న షేక్ జాఫర్ గతంలో పలుమార్లు శిక్షణా కార్యక్రమంలో రీసోర్స్‌పర్సన్‌గా పని చేశారు.2021లో ఈ పాఠశాల ఇన్స్పైర్ ప్రాజెక్టు జాతీయస్థాయికి ఎంపికై ఆనాడు ప్రశంసలు అందుకుంది.కాగా నిర్మల్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్‌ఫేర్‌లో టీచర్స్ విభాగంలో సెకండరీ గ్రేడ్ ఫిజిక్స్ టీఎల్‌ఎంతో కేరళలో జరిగే దక్షిణ భారతదేశ స్థాయి సైన్స్‌ఫేర్‌కు జాఫర్ ఎంపికైన సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ, శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి ఇంద్ర కిరణ్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన మెమెంటో అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఎంపిక పట్ల జిల్లాలోని ఉపాధ్యాయులు, మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్స్, మిత్రులు జాఫర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.