Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ నాయత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది
- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ- రామన్నపేట
ప్రజావ్యత్రిక పాలన సాగిస్తూ, మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశ ప్రజల మధ్య అంతరాల సృష్టిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేది కెేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్సేనని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మండలానికి చెందిన 138 మంది లబ్ధిదారులకు 1 కోటి 40 లక్షల విలువ గల కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కెసిఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు. ప్రజలందరూ కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి, జడ్పిటిసి పున్న లక్ష్మి, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు అప్పం లక్ష్మీనర్సు, గుత్తా నరసింహారెడ్డి, అంతటి పద్మ, కడమంచి సంధ్య, ముత్యాల సుజాత, కాటేపల్లి సిద్ధమ్మ, ఎంపీటీసీలు గొరిగే నరసింహ, గోగు పద్మ, దోమల సతీష్, గాదే పారిజాత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.