Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వలిగొండ రూరల్
మండల పరిధిలోని భీమాలింగం కత్వా నుండి ముద్దాపురం చెరువు వరకు గల నీటి కాలువలో గుర్రపు డెక్క ఆకు అధికంగా ఉండడంతో నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుండడంతో ఆయా గ్రామాల రైతులు స్థానిక శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి కి విన్నవించగా వెంటనే స్పందించి తన సొంత నిధుల నుండి రెండు హిటాచిలను కేటాయించి గుర్రపు డెక్క ఆకును తొలగించే పనులను శుక్రవారం ప్రారంభించినందుకు రైతులు పైళ్ల శేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సోలిపురం సాగర్ రెడ్డి, పెద్దిరెడ్డి ఉప్పల్ రెడ్డి, కీసర్ల రాంరెడ్డి, గరిసే నరసమ్మ నరసింహ, బోడ పట్ల భారతమ్మ జాన్ రెడ్డి, ఎంపీటీసీలు గూడూరు వెంకటరెడ్డి, సామ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.