Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చౌటుప్పల్ రూరల్
మండలంలోని పలు గ్రామాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటల పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మండలంలోని పంతంగి, నేలపట్ల, జై కేసారం గ్రామాల్లో డీవైఎఫ్ఐ,ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. నేలపట్ల గ్రామంలో ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ గ్రామంలోని యువతకు క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసహానికి దోహదపడతాయని తెలిపారు. జై కేసారం గ్రామంలో చౌటుప్పల్ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ పాటల పోటీలలో ప్రారంభించారు. పంతంగి గ్రామంలో ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తడక మోహన్, బుట్టి కృష్ణ, గుర్రం ప్రమోద్, వేణు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలు మానసికోల్లాసానికి దోహదం
క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని చౌటుప్పల్ ఎస్సై దైదా అనిల్ అన్నారు. మండలంలోని జైకేసారం గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు.దొడ్డి కార్తిక్ స్మారకార్దం 33వ వార్షికోత్సవ క్రీడల పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు గ్రామీణ ప్రాంత యువత నైపుణ్యాలను వెలిక్కితీయడానికి ఉపయోగ పడతాయని తెలిపారు. డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలను మానుకోవాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో యువతను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గంజి జహంగీర్,మాజీ వార్డు సభ్యులు మాడగొని మారయ్య,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు పల్లె శివ,నాయకులు పల్లె అనిల్ కుమార్,విజయ్ కుమార్,బొడిగే సైదులు,మధు,రాజేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.