Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి
నవతెలంగాణ-చౌటుప్పల్
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి తెలిపారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని చందన స్కూల్లో ఐద్వా పట్టణకమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్య అతిథులుగా పాల్గొన్న కౌన్సిలర్లు తాడూరి శిరీషపరమేశ్, దండ హిమబిందుఅరుణ్కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళల్లో ఉన్న సృజనాత్మకత వెలికితీయడానికి పోటీలు ఎంతో దోహదపడ్తాయన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రథమ బహుమతి పోలోజు శ్రీలత, ద్వితీయ బహుమతి ప్రవళిక, తృతీయ బహుమతి గుంటోజు లావణ్య, మ్యూజికల్ ఛైర్లో ప్రథమ బహుమతి పోలోజు శ్రీలత, ద్వితీయ బహుమతి ధనలక్ష్మీ, తృతీయ బహుమతి భవానీతోపాటు మరికొంతమంది గెలుపొందారు. విజేతలకు వారు బహుమతులు ప్రదానంచేశారు. అనంతరం అవ్వారు రామేశ్వరి మాట్లాడుతూ మహిళలు స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో నేటికీ వివక్షతకు గురవుతున్న మహిళలు సమాన హక్కులతోపాటు జీవించే హక్కు కోసం పోరాడాలని నిత్యం ఐద్వా కృషిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా కమిటీ నాయకులు బత్తుల జయమ్మ, దొడ్ల ఆండాలు, మహిళలు పాల్గొన్నారు.