Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
యథేచ్ఛగా అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను పట్టణ పరిధిలోని రామిరెడ్డిపాలెం గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. అనంతగిరి మండలం వెంకట్రామపురంలోని ప్రభుత్వ భూముల్లో మట్టిదందాని దళారులు రాత్రి సమయంలో యదాచ్చగా దందా చేస్తున్నారని, మైనింగ్ నిబంధనలకు వ్యతిరేకంగా రాత్రి సమయంలో భారీ వాహనాలతో మట్టి తరలించడం వల్ల గ్రామంలో ఉన్న రోడ్డు ధ్వంసం అవుతుందని ఆందోళన చేశారు. పండుగ సెలవులు కావడంతో పిల్లలు రోడ్లపై ఆడుకుంటున్నారు. అయినా అతివేగంతో వాహనాలు నడుపుతున్నాదరని ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు టిప్పర్లను అక్కడి నుంచి పంపియడంతో పోలీసులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవాల్సిన పోలీసులు దళారుల చెంతన చేరి ఆందోళన చేస్తున్న గ్రామస్తులనే చెదరగొట్టారు. ఇప్పటికైనా అధికారులు మైనింగ్ దందా చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.