Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల పక్షాల మీడియా సమావేశంపై దాడులు
- ఇరువర్గాల తోపులాట
నవతెలంగాణ -ఆత్మకూరు ఎస్
ఆత్మకూరు మండల కేంద్రంలో పెద్ద గుట్ట ఫై పేలుళ్ళు, క్రషర్‌ను తొలగించాలంటూ అఖిల పక్షాలు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించగా క్రషర్ యజమాని కొణతం సత్యనారాయణ రెడ్డి అనుచరులతో అఖిల పక్షాల నాయకులఫై దాడికి పాల్పడ్డాడు. ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండేళ్లుగా పెద్దగుట్ట ఫై అనుమతులు లేకుండా భారీ పేలుళ్ళు నిర్వహించడంతో అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇండ్లు, పంట పొలాలు పాడవుతున్నాయని జిల్లాస్థాయి అధికారులతో పాటు కోర్టును ఆశ్రయించారు. కొద్దిరోజులు స్టే ఇచ్చిన కోర్టు ఇటీవల స్టేను ఎత్తివేసింది. దీంతో ఆగిపోయిన క్రషర్ తిరిగి ప్రారంభించారు. పెద్దగుట్టపై మళ్లీ పేలుళ్లు ప్రారంభించడంతో అఖిలపక్షాల నాయకులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. శుక్రవారం స్థానిక బస్టాప్ లో అఖిల పక్షాల ఆధ్వర్యంలో పెద్దగుట్ట పేలుళ్లు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై అఖిలపక్షం మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ,కాంగ్రెస్, సీపీఐ ఎంల్ న్యూడేమోక్రసి, నాయకులు సమావేశంలో మాట్లాడుతుండగా క్రషర్ యజమాని కొనతం సత్యనారాయణ రెడ్డి తన అనుచరులతో వచ్చి అఖిల పక్షాల నేతలఫై దాడికి పాల్పడ్డాడు. ఇరువర్గాల మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలను సర్ది చెప్పి పంపించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాడులు చేస్తే సహించేది లేదు
అధికార పార్టీని అడ్డం పెట్టుకొని అఖిల పక్షాలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని అఖిలపక్షాల నేతలు హెచ్చరించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్రషర్ ఏర్పాటు చేయడమే కాకుండా ఇష్టా రాజ్యాంగా పెద్ద గుట్ట ఫై పేలుళ్ళు నిర్వహిస్తే ఊరుకోమని అఖిల పక్షాల నేతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు తంగేళ్ల వీరారెడ్డి, చిలుముల గోపాల్ రెడ్డి, బీజేపీ మండలపార్టీ అధ్యక్షులు పందిరి రాం రెడ్డి, మాధవ రెడ్డి, న్యూడేమోక్రసి నాయకులు డేగల వెంకట కృష్ణ, పోరిండ్ల దశరథ,రైతులు పందిరి శ్రీనివాస్ రెడ్డి,కృష్ణా రెడ్డి విసవరం రాం రెడ్డి, వెంకటనర్సింహా రెడ్డి,గిలకత్తులఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.