Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-మునగాల
సీపీఐ(ఎం)సీనియర్ నాయకులు ఉప్పుల కాంతారెడ్డి మృతి బాధకరమని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మునగాలలో కాంతారెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంతారెడ్డి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరనిలోటని తెలిపారు. ఏడు దశా బ్దాల పాటు ప్రజా సమస్యల పరిష్కా రం కోసం కృషి చేశారని కొనియాడారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సేవలందించారని చెప్పారు. మునగాల పరగణాతో పాటు కోదాడ, హుజూర్ నగర్ నియోజ వర్గాల్లో కమ్యూనీస్టు పార్టీ బలోపేతానికి కడదాకా శ్రమించారని తెలిపారు. పేదలు వ్యవసాయ కార్మికులు, రైతాంగానికి సేవలందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. ఎత్తిపోతల పధకాల్లో వున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రతిసారి తన దృష్టికి తెచ్చేవారని చెప్పారు. మునగాల ఎత్తి పోతల పధకాన్ని సమర్దవంతంగా నిర్వహించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. లిప్టు పరధిలోని కాల్వ చివరి భూములకు నీరందించేందుకు చేసిన కృషి మరువలేనిదన్నారు. కాంతారెడ్డి మృతికి సంతాపం వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు దేవరం వెంకటరెడ్డి, మండల పరిషత్ వైస్ చైర్మెన్ కొలిశెట్టి బుచ్చి పాపయ్య, నాగార్జున మోడరన్ రైస్ మిల్ మేనేజింగ్ పాట్నర్ కాంపెల్లి నర్సిరెడ్డి, కాంతారెడ్డి కమారుడు డాక్టర్ వుప్పుల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి, సీనియ ర్ నాయకులు వుప్పల జానికిరెడ్డి, సామేలు, కాసర్ల కోటేశ్వరరావు, భీంపంగు శంకర్, కాసర్ల వెంకట్ వార్డు మెంబర్లు దేవరం శ్రీనివాసరెడ్డి, తంగెళ్ళ చిన్న పాల్గొన్నారు.