Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
లాగుడు పీకుడు రాగాలతో శాస్త్రీయ సంగీతం అంటే ఆమడ దూరం పరిగెత్తే జనాలకి, అందులో ఉండే మాధుర్యం, మత్తూ చూపించీ, సంగీతం అంటే మరింత ఆసక్తిని కలిగించిన గొప్పతనం త్యాగరాజ దే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.గురువారం రాత్రి స్థానిక త్రివేణి ఫంక్షన్ హాల్లో సుధా బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన త్యాగరాజ ద్విదశాబ్ది ఆరాదోనోత్సవాలలో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రస్తుతమున్న కచేరీ పద్ధతికి ప్రాణం పోసిన వాళ్ళల్లో ఆద్యుడు అన్నారు.సరళమైన భాషలో వినసొంపైన శాస్తీయ సంగీతాన్ని త్యాగరాజు అజరామరం చేసాడన్నారు. కర్ణాటక సంగీతానికీ, త్యాగరాజుకీ విడదీయరాని బంధం ఉందన్నారు. సుధా బ్యాంక్ అధ్వర్యంలో త్యాగరాజ ఆరాధోత్సవాలు నిర్వహించడం శుభ పరిణామన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్వాంసులను మంత్రి సన్మానించారు. సంగీత విద్వాంసులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో సుధా బ్యాంకు చైర్మెన్ మీలా మహాదేవ్,యండి పెద్దిరెడ్డి గణేష్,పెద్దిరెడ్డి రాజా ,గండూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతికీ, సాంప్రదాయాలకు ప్రతీక ముగ్గుల పోటీలు
మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
తెలుగు సంస్కృతికి, సాంప్రదాయాలకు ముగ్గుల పోటీలు ప్రతీకలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.శుక్రవారం స్థానిక విద్యానగర్ లో 46 వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఆంగోతు బావ్ సింగ్ , సంధ్య ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలకు హాజరై విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ అని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారుల సంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ గోపాగని వెంకట్ నారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.