Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే. వెంకటేష్
నవతెలంగాణ-సూర్యాపేట
మోదీ తెచ్చిన లేబర్ కోడులకు వ్యతిరేకంగా ఏప్రిల్ 5న కార్మిక, కర్షక ఐక్య వేదికఆధ్వర్యంలో చలో పార్లమెంటు కు లక్షలాదిమంది కార్మికులు తరలి రావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్ పీలుపు నిచ్చారు.శుక్రవారం స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన ఆ సంఘం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మోడీ ప్రభుత్వము హిందుత్వ వాదం తో కార్మికుల మద్య కులం, మతం చిచ్చు లేపి కార్మికుల మధ్య చీలికలు తెచ్చి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పని చేస్తున్నారని ఆయన విమర్శించారు.ఏప్రిల్ 5న పార్లమంటు ముట్టడితో మోదీ ప్రభుత్వము మునిగి పోతుందన్నారు.దేశం లో కోట్లాది మంది స్కీమ్ వర్కర్లు సమాజ సంక్షేమం కోసం పని చేస్తున్నారని వారికీ కనీస వేతనాలు అమలు చేయకుండా వెట్టి చాకిరి చేయించుకుంటూ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని వారికి కనీస వేతనాలు 21వేలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ,అధ్యక్షులు రాంబాబు కె వెంకటనారాయణ, ఏకలక్ష్మి, శీలం శీను ,ఎలక సోమన్న గౌడ్ ,రాధాకృష్ణ, కృష్ణ రణపంగ , ముత్యాలు, బొజ్జ సైదయ్య, యాతాకులు ఎంకన్న ,సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.