Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెర్వుగట్టు బ్రహ్మౌత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి
నవతెలంగాణ-నార్కట్పల్లి
చెరువుగట్టులోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి బ్రహ్మౌత్సవాలు ఈనెల 28న ప్రారంభం అవుతున్న క్రమంలో, చాలా తక్కువ సమయం ఉన్నందున కళ్యాణ వేదిక పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని చెర్వుగట్టు బ్రహ్మౌత్సవాల ఏర్పాట్లను, కళ్యాణ వెదిక స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 28 నుండి ఫిబ్రవరి 2 వరకు చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షికబ్రహ్మౌత్సవాలు అధికారులు, దేవాలయ సిబ్బంది పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పారు. స్వామివారి కళ్యాణ అనంతరం అధిక సంఖ్యలో భక్తులు తలంబ్రాల బియ్యం పోసేందుకు పోటీ పడుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు శాఖా పరమైన చర్యలు చేపట్టాలన్నారు. పనులలో జాప్యం ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ నర్సింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, ఆలయ ఈఓ నవీన్, సర్పంచ్ మల్గ బాలక్రిష్ణ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, కొండూరు శంకర్, కమ్మంపాటి వెంకన్న, మేడి శంకర్, ఒంపు శివ, జ్ఞానేశ్వర్, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.